Telugu Global
Telangana

బావా కుమ్మేశావ్.. హరీష్‌రావుపై కేటీఆర్ ప్రశంసలు

సీఎం సహా మంత్రుల బృందాన్ని హరీష్‌ రావు సింగిల్‌ హ్యాండ్‌తో ఎదుర్కొన్నారంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఛలో నల్గొండ సభకు హరీష్ గట్టి పునాది వేశారని కొనియాడారు.

బావా కుమ్మేశావ్.. హరీష్‌రావుపై కేటీఆర్ ప్రశంసలు
X

కృష్ణా ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ తరఫున చర్చను హరీష్‌ రావు హ్యాండిల్ చేసిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తన బావ హరీష్‌ రావును మెచ్చుకున్నారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.


సీఎం సహా మంత్రుల బృందాన్ని హరీష్‌ రావు సింగిల్‌ హ్యాండ్‌తో ఎదుర్కొన్నారంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కృష్ణా జలాలు, KRMBకి ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని, ఆ పార్టీ నేతల వైఖరిని హరీష్‌ రావు గట్టిగా తిప్పికొట్టారన్నారు. ఛలో నల్గొండ సభకు హరీష్ గట్టి పునాది వేశారని కొనియాడారు. ఇక ఛలో నల్గొండ సభలో కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలకు కేసీఆర్ స్ట్రాంగ్ రిప్లై ఇస్తారని తన ట్వీట్‌లో చెప్పారు కేటీఆర్.

షరతులకు అంగీకరిస్తే గానీ KRMBకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున‌ హరీష్ రావు లీడ్ తీసుకున్నారు. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల బృందాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. అవసరమైన చోట సెటైర్లు వేస్తూ బీఆర్ఎస్‌పై సీఎం, మంత్రులు చేసిన ఆరోపణలకు సావధానంగా సమాధానాలు చెప్పారు.

First Published:  12 Feb 2024 2:56 PM GMT
Next Story