Telugu Global
Telangana

వారంతా రీల్ ఫిల్మ్ స్టార్స్.. రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్.. - ఆర్జీవీ ట్వీట్

యష్‌, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రీల్ ఫిల్మ్ స్టార్లు. రియల్ పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ కేసీఆర్ ' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

వారంతా రీల్ ఫిల్మ్ స్టార్స్.. రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్.. - ఆర్జీవీ ట్వీట్
X

నిత్యం వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. తెలుగు అగ్రహీరోలు రీల్ ఫిలిం స్టార్స్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ రియల్ పాన్ ఇండియా స్టార్ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాను కాక పుట్టిస్తోంది.

ఆర్జీవీ తెలుగు అగ్రహీరోలపై వివాదాస్పద కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏపీలో సినిమా టికెట్ ధరలు పెంచాలంటూ రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు విజయవాడలో సీఎం జగన్ ను కలిశారు. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ 'రియల్ బాహుబలి జగన్' అని కామెంట్స్ చేశారు.

Advertisement

ఇప్పుడు మరోసారి తెలుగు అగ్రహీరోలపై అలాగే నోరు పారేసుకున్నారు వర్మ. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరుతో ఒక జాతీయ పార్టీ స్థాపించనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెలుగు అగ్రహీరోలను రీల్ హీరోలుగా పేర్కొంటూ రియల్ పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ కేసీఆర్ అని ఒక ట్వీట్ చేశారు.

Advertisement

'బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2 అడుగుజాడల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ తో పాన్ ఇండియాకు వెళ్లనుంది. యష్‌, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రీల్ ఫిల్మ్ స్టార్లు. రియల్ పొలిటికల్ పాన్ ఇండియా స్టార్ కేసీఆర్ ' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆయా హీరోల ఫ్యాన్స్ వర్మపై తిట్ల దండకం అందుకున్నారు. తమ హీరోలను చిన్న చూపు చూడడంపై మండిపడుతున్నారు.

Next Story