Telugu Global
Telangana

ఆదిపురుష్ కేసీఆర్.. ఆర్జీవీ ట్వీట్ అదిరింది..

కేసీఆర్ రాజకీయాలు, బీఆర్ఎస్ ఆవిర్భావం.. అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆర్జీవీ కూడా అందుకే ఇలా ట్వీట్ వేసి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

ఆదిపురుష్ కేసీఆర్.. ఆర్జీవీ ట్వీట్ అదిరింది..
X

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూటిగా సుత్తిలేకుండా మాట్లాడతారు. ఆయన మాటలు కాస్త కఠినంగా ఉన్నా, వాస్తవాలు కుండబద్దలు కొట్టినట్టు ఉంటాయి. అనవసరంగా ఎవరినీ పొగడరు, అవసరానికి ఎవర్నీ తిట్టరు. అలాంటి ఆర్జీవీ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్ ఆదిపురుష్ అని కీర్తించారు. ఆదిపురుష్ అంటే.. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చిన మొట్టమొదటి వ్యక్తి అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

వెల్కమ్ టు నేషనల్ పాలిటిక్స్..

టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆదిపురుష్ అయ్యారని, వెల్కమ్ టు నేషనల్ పాలిటిక్స్ అంటూ ట్వీట్ చేసి మరీ బీఆర్ఎస్ కి శుభాకాంక్షలు తెలిపారు, కేసీఆర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఆర్జీవీ. రాజకీయ వ్యంగ్యాస్త్రాలు విసిరే ఆర్జీవీ, నేరుగా ఎప్పుడూ రాజకీయాలపై కామెంట్ చేయలేదు. అలాంటి వర్మ.. కూడా బీఆర్ఎస్ విషయంలో ట్వీట్ చేశారంటే కేసీఆర్ తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారని చెప్పాలి.

గ్లోబలైజేషన్ పుణ్యమా అని లోకల్, యూనివర్స‌ల్‌ అనే సరిహద్దులు పూర్తిగా చెరిగిపోయాయి. లోకల్ పార్టీ, నేషనల్ పార్టీ అని ఎవరూ గిరిగీసుకోవాలనుకోవట్లేదు. కానీ ప్రాంతీయ పార్టీలేవి జాతీయ రాజకీయాల్లో తలదూర్చాలనుకునే సాహసం చేయట్లేదు. ఢిల్లీతో మొదలు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మమతా బెనర్జీ, మాయావతి వంటి నేతలు కూడా దేశ రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు కానీ, వారి వ్యవహారం వేరు. పక్కా లోకల్ పార్టీలు.. ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే, వాటిని అడ్డం పెట్టుకుని సంకీర్ణంలో చక్రం తిప్పాలనుకుంటున్నాయి. కానీ కేసీఆర్ నేరుగా రాష్ట్ర పార్టీని, జాతీయ పార్టీగా మార్చడం మాత్రం పెద్ద సంచలనమేనని చెప్పాలి. తెలంగాణలో అధికార పార్టీగా ఉండటంతోపాటు, ఏపీలో కూడా బీఆర్ఎస్ ఉనికి చాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు కర్నాటకలో బీఆర్ఎస్ కి అప్పుడే పొత్తు ఖరారైపోయింది. బీఆర్ఎస్ తో కలసి పోటీ చేస్తామని జేడీఎస్ నేతలు ప్రకటించారు. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పొత్తులు ఉంటాయి, ఇంకొన్ని చోట్ల ఏకంగా విలీనాలే ఉంటాయని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే కేసీఆర్ రాజకీయాలు, బీఆర్ఎస్ ఆవిర్భావం... అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆర్జీవీ కూడా అందుకే ఇలా ట్వీట్ వేసి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

First Published:  6 Oct 2022 1:24 AM GMT
Next Story