Telugu Global
Telangana

తాతగారూ .. మీరింకా ఉన్నారా? - వీహెచ్‌పై ఆర్జీవీ సెటైర్లు

రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి సమాజానికి చాలా ప్రమాదకరమని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా ఏపీ సీఎం జగన్ కు వీహెచ్‌ లేఖ రాశారు.

తాతగారూ .. మీరింకా ఉన్నారా? - వీహెచ్‌పై ఆర్జీవీ సెటైర్లు
X

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎక్కడికెళ్లినా వివాదాస్పదంగా మాట్లాడటం ఆర్జీవీకి అలవాటే.. ఆ విషయం తెలిసి కూడా నాగార్జున వర్సిటీ ప్రోగ్రామ్ కు అక్కడి నిర్వాహకులు పిలిచారు. ఎప్పటిలాగే ఆర్జీవీ కొన్ని సంచలన కామెంట్లు చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆర్జీవీకి వ్యతిరేకంగా.. అనుకూలంగా పోస్టులు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉంటే.. ఆర్జీవీ కామెంట్లపై తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హ‌నుమంత‌రావు తీవ్రంగా మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి సమాజానికి చాలా ప్రమాదకరమని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.


ఈ నేపథ్యంలో తాజాగా వీహెచ్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 'తాతగారూ మీరింకా వున్నారా??? NASA యాక్ట్ వర్తించదు.. TADA యాక్ట్‌ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి.. ఒకసారి డాక్టర్‌కి చూపించుకోండి' అంటూ ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై వీహెచ్ ఎలా స్పందిస్తారో.. వేచి చూడాలి.

First Published:  19 March 2023 9:50 AM GMT
Next Story