Telugu Global
Telangana

హైద‌రాబాద్ టు సింగ‌పూర్, కొలంబో.. నేటి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్‌

సింగ‌పూర్‌, కొలంబోల‌కు హైద‌రాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ స‌ర్వీసులు ప్రారంభిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్ర‌క‌టించారు.

హైద‌రాబాద్ టు సింగ‌పూర్, కొలంబో.. నేటి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్‌
X

హైద‌రాబాద్ టు సింగ‌పూర్, కొలంబో.. నేటి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్‌

సింగ‌పూర్ వెళ్లాల‌నుకుంటున్నారా లేదా శ్రీ‌లంక టూర్ వేయాల‌నుకుంటున్నారా.. ఇక హైద‌రాబాద్ నుంచి నేరుగా ఎగిరిపోవ‌చ్చు. సింగ‌పూర్‌, కొలంబోల‌కు హైద‌రాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ స‌ర్వీసులు ప్రారంభిస్తున్న‌ట్లు హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్ర‌క‌టించారు. ఈ నెల 29 అంటే ఆదివారం నుంచే ఈ స‌ర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.

సింగ‌పూర్‌కు డైలీ విమానం

రేపు (ఆదివారం) తెల్ల‌వారుజామున హైద‌రాబాద్ నుంచి సింగ‌పూర్‌కు డైరెక్ట్ ఫ్లైట్ స‌ర్వీసులు ప్రారంభిస్తారు. ఉదయం 11. 20గంట‌ల‌కు హైద‌రాబాద్‌లో బ‌య‌ల్దేరిన ఫ్లైట్ సాయంత్రం 6:20 గంట‌ల‌కు సింగ‌పూర్ చేరుకుంటుంది. అక్క‌డి నుంచి రాత్రి 8కి బ‌యల్దేరి తిరిగి హైద‌రాబాద్‌కు 10:15 కి వ‌స్తుంది. ఈ డైరెక్ట‌ర్ ఫ్లైట్ స‌ర్వీసు రోజూ ఉంటుంది.

కొలంబోకు వారంలో నాలుగు రోజులు

ఇక శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబోకు కూడా హైద‌రాబాద్ నుంచి నేరుగా ఫ్లైట్ స‌ర్వీస్ న‌వంబ‌ర్ 3న ప్రారంభ‌మ‌వుతుంది. ఉద‌యం 11.50కు హైద‌రాబాద్‌లో బ‌య‌ల్దేరి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు కొలంబో చేరుతుంది. తిరిగి అక్క‌డి నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి సాయంత్రం 5 గంట‌ల‌క‌ల్లా శంషాబాద్‌కు వ‌చ్చేస్తుంది. అయితే ఈ స‌ర్వీసు ఆది, సోమ‌, మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో మాత్ర‌మే ఉంటుంద‌ని ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్ర‌క‌టించారు.

First Published:  28 Oct 2023 7:30 AM GMT
Next Story