హైదరాబాద్-విజయవాడ హైవేపై పేలిన డీజిల్ ట్యాంకర్
హైవేపై పెద్ద ఎత్తున నిలిచిన వాహనాలు.. భారీగా ట్రాఫిక్ జామ్
BY Raju Asari11 Oct 2024 8:05 AM GMT
X
Raju Asari Updated On: 11 Oct 2024 8:05 AM GMT
నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేకి దూసుకొచ్చిన లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న డీజిల్ ట్యాంకర్ పేలి భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ బైటికి దూకి ప్రాణాలను కాపాడుకోగా.. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
Next Story