Telugu Global
Telangana

8 ఏళ్ళలో తెల‍ంగాణ అభివృద్ది: 'డబుల్ ధమాకా' కాదు అంతకు మించి...

ఈ ఎనిమిదేళ్ళలో జరిగిన ఈ అభివృద్ది అంత సులభంగా వచ్చిందేమీ కాదు. ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ది కి సమాన శ్రద్ద ను పెట్టడం వల్ల జరిగిన అభివృద్ది ఇది. ఒక వైపు కేంద్ర బీజేపీ సర్కార్ రాష్ట్రానికి ఒక్క పైసా ఆర్థిక సహాయం చేయకపోయినప్పటికీ తెలంగాణ తన కాళ్ళ మీద తాను నిబడి వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నది.

8 ఏళ్ళలో తెల‍ంగాణ అభివృద్ది: డబుల్ ధమాకా కాదు అంతకు మించి...
X

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి అభివృద్ది పథంలో అడుగులు వేస్తోంది. నీటి వనరుల పెంపు, వ్యవ‌సాయం పై అధిక దృష్టి, పెట్టుబడులు రాబట్టడంలో ప్రత్యేక శ్రద్ద, చేతి వృత్తిదారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలతో తెలంగాణ ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

తాజాగా భారత ప్రభుత్వపు 'నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ' లెక్కల ఆధారంగా రిజర్వు బ్యాంకు ఇండియా హ్యాండ్ బుక్ లో విడుదల చేసిన వివరాల ప్రకారం... తెలంగాణ స్థూల దేశీయ ఉత్పత్తి (Gross domestic product) 2013, 14 సంవత్సరంలో 4 లక్షల 51 వేల 580 కోట్ల రూపాయలుండగా, 2021, 22 కు అది 11 లక్షల 48వేల 114 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే దాదాపు మూడు రెట్ల GSDP పెరిగింది. ఇక తెలంగాణ తలసరి ఆదాయం (Per Capita Income) 2013,14 లో 1లక్షా 12వేల 162 రూపాయలుండగా 2021, 22 లో 2 లక్షల 75 వేల 443 రూపాయలకు పెరిగింది అంటే రెట్టింపుకన్నా ఎక్కువ.

ఈ ఎనిమిదేళ్ళలో జరిగిన ఈ అభివృద్ది అంత సులభంగా వచ్చిందేమీ కాదు. ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ది కి సమాన శ్రద్ద ను పెట్టడం వల్ల జరిగిన అభివృద్ది ఇది. ఒక వైపు కేంద్ర బీజేపీ సర్కార్ రాష్ట్రానికి ఒక్క పైసా ఆర్థిక సహాయం చేయకపోయినప్పటికీ తెలంగాణ తన కాళ్ళ మీద తాను నిబడి వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నది.

ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకవచ్చింది. అంతే కాక రాష్ట్ర వ్యాప్తంగా చెరువులను బాగు చేయించడం వల్ల సాగుకు నీరు అందుబాటు పెరిగింది.

2013,14లో1.54 కోట్ల ఎకరాల భూముల్లో సాగు జరిగితే 2021లో1.85 కోట్ల ఎకరాల భూములు సాగులో ఉన్నాయి.

పంట దిగుబడి కూడా బాగా పెరిగింది. 2013,14 లో 1.92 కోట్ల టన్నుల పంట దిగుబడి వస్తే 2021 లో , రాష్ట్ర వ్యవ‌సాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పిన ప్రకారం దాదాపు 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. రైతు బంధు పథకం కూడా ఈ పంట దిగుబడి పెరగడానికి కారణమయ్యింది. అంతకు ముందు చిన్న సన్నకారు రైతులు విత్తనాలు వేయడానికి, పంట పండించడానికి అవసరమైన ఆర్థిక శక్తి లేక భూములనే పడావు పెట్టుకునే వాళ్ళు.

ఇక చేనేత కార్మికులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వారి నుండి ప్రతి సంవత్సరం లక్షలాది చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ బతుకమ్మ పండుగకు రాష్ట్ర‍ం లోని మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. చేనేతపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించి వారి జీవితాలను మరింత దిగజారేట్టు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారి జీవితాల్లో వెలుగులునింపడానికి కృషి చేస్తోంది. అదే విధంగా కేంద్రం చేనేత మీద జీఎస్టీ ఎత్తివేసే విధంగా కేటీఆర్ పోరాటం కూడా ప్రారంభించారు.

ఇక రాష్ట్రానికి పెట్తుబడుల విషయానికి వస్తే దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడం లో మంత్రి కేటీఆర్ నిరంతర శ్రమ, సంప్రదింపులు మంచి ఫలితాలను ఇస్తున్నాయ‌ని అధికారులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి ఇప్పటి వరకు, ఈ 8 ఏళ్ళలో రూ.2,34,836 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దీనిద్వారా 76,56,460 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణను అనుకూలమైన గమ్యస్థానంగా మార్చడానికి, రాష్ట్ర ప్రభుత్వం TS-iPASS (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) చట్టాన్ని అమలులోకి తేవడం వల్ల ఈ పెట్టుబడుల వెల్లువ సాధ్యమైందని అధికారులు చెప్తున్నారు.

మొత్తానికి తెలంగాణను అభివృద్ది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంతర శ్రమ, ప్రణాళికలు విజయవంతం అయ్యి ఈ రోజు తెలంగాణ స్థూల దేశీయ ఉత్పత్తి కానీ, తెలంగాణ తలసరి ఆదాయం కానీ ఊహించని విధంగా పెరగడానికి కారణమయ్యింది.

First Published:  20 Nov 2022 8:35 AM GMT
Next Story