Telugu Global
Telangana

ఢిల్లీ: కవిత దీక్ష యథాతథం...బీజేపీ ధర్నా వేదిక మార్పు

ఈ రోజు మధ్యాహ్నం నుండి అనేక మలుపులు తిరిగిన ఈ వ్యవహారం చివరకు ప్రశాంతంగా ముగిసింది. ఈ దీక్ష కోసం కవిత 12 రోజుల క్రితమే ఢిల్లీ పోలీసుల అనుమతి కోరగా జంతర్ మంతర్ వద్ద పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ స్థలంలో 6 వేల మంది కూర్చునేందుకు వీలుగా బీఆరెస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే హఠాత్తుగా బీజేపీ రంగంలోకి వచ్చింది.

ఢిల్లీ: కవిత దీక్ష యథాతథం...బీజేపీ ధర్నా వేదిక మార్పు
X

మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలనే డిమాండ్ తో రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీఆరెస్ ఎమ్మెల్సీ, బారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన దీక్ష యథాతథంగా జరగనుంది.

ఈ రోజు మధ్యాహ్నం నుండి అనేక మలుపులు తిరిగిన ఈ వ్యవహారం చివరకు ప్రశాంతంగా ముగిసింది. ఈ దీక్ష కోసం కవిత 12 రోజుల క్రితమే ఢిల్లీ పోలీసుల అనుమతి కోరగా జంతర్ మంతర్ వద్ద పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ స్థలంలో 6 వేల మంది కూర్చునేందుకు వీలుగా బీఆరెస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే హఠాత్తుగా బీజేపీ రంగంలోకి వచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కు వ్యతిరేకంగా తాము కూడా రేపే ధర్నా చేస్తామని బీజేపీ పోలీసుల అనుమతి కోరింది. దాంతో పోలీసులు కవితను దీక్షా స్థలాన్ని మార్చుకోవాలని కోరారు. కవిత ససేమిరా అనడంతో అనుమతి ఇచ్చిన స్థలంలో సగం స్థలంలో మాత్రమే దీక్ష చేయాలని, మిగతా సగం స్థలం బీజేపీకి కేటాయిస్తామని చెప్పారు. ఈ విషయంపై మధ్యాహ్నం నుంచి పోలీసులకు బీఆరెస్ నాయకులకు మధ్య చర్చలు జరిగాయి. చివరకు పోలీసులు కవిత దీక్ష యథాతథంగా జరిగేందుకు అనుమతి ఇచ్చారు. ఇక బీజేపీకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ లో, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి దగ్గరలో ధర్నా చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించారు. ఆప్ కార్యాలయానికి సమీపంలో కావడంతో బీజేపీ నాయకులు కూడా అందుకు అంగీకరించారు.

First Published:  9 March 2023 1:00 PM GMT
Next Story