Telugu Global
Telangana

ఈడీ చెప్పిన ఆ ఒక్క కారణంతో.. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరణ

అలాంటి వ్యక్తి బయటకు వస్తే కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమూరు చేసే ప్రమాదం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. 4వ తేదీన తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. ఇవాళ బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది.

ఈడీ చెప్పిన ఆ ఒక్క కారణంతో.. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరణ
X

లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టు అయి జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్‌ నిరాకరిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పునిచ్చింది. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌ అయినా ఇవ్వాలంటూ కవిత పిటిషన్‌ దాఖలు చేశారు.

అయితే ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని, బెయిల్‌ ఇవ్వవద్దని కోర్టును ఈడీ కోరింది. పైగా కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమూరు చేసే ప్రమాదం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. 4వ తేదీన తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. ఇవాళ బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చింది.

కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇవాళ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో రేపు మళ్లీ తీహార్‌ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తారు. మరోవైపు కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఈనెల 20 వరకు వాదనలు వింటామని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.

First Published:  8 April 2024 5:48 AM GMT
Next Story