Telugu Global
Telangana

'ప్రియమైన బర్రె, మోడీ వందే భారత్ రైలు ప్రారంభిస్తున్నారు దయచేసి అటువైపు వెళ్ళకు'

''ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే బర్రెలు, ఆవులు గుద్దుకొని అనేక వందే భారత్ రైళ్ళు దెబ్బతిన్నాయి. అలాంటి బలహీనమైన రైళ్ళతో వాటికే కాదు మీకు కూడా ప్రమాదమే. కాబట్టి మీరు అటువైపు వెళ్ళకండి. అటువైపు వెళ్ళొద్దని మీ బంధుమిత్రులకు కూడా చెప్పండి.'' అంటూ సతీష్ రెడ్డి బర్రెలకు విజ్ఞప్తి చేశారు.

ప్రియమైన బర్రె, మోడీ వందే భారత్ రైలు ప్రారంభిస్తున్నారు దయచేసి అటువైపు వెళ్ళకు
X

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన‌ సందర్భంగా ఆయన‌కు వినూత్న నిరసనలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ నగరమంతా ఒకవైపు ఆయనకు, బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనమిస్తుండగా, టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు.

ఈ రోజు మోడీ సికిందరాబాద్ స్టేషన్ లో వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారు. దేశంలో వందే భారత్ రైళ్ళు ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు దాదాపు 68 వరకు ప్రమాదాలు జరిగాయి. బర్రెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైళ్ళు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని సతీష్ రెడ్డి బర్రెలకు వినూత్న‌ విజ్ఞప్తి చేశారు.

''ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే బర్రెలు, ఆవులు గుద్దుకొని అనేక వందే భారత్ రైళ్ళు దెబ్బతిన్నాయి. అలాంటి బలహీనమైన రైళ్ళతో వాటికే కాదు మీకు కూడా ప్రమాదమే. కాబట్టి మీరు అటువైపు వెళ్ళకండి. అటువైపు వెళ్ళొద్దని మీ బంధుమిత్రులకు కూడా చెప్పండి.'' అంటూ సతీష్ రెడ్డి బర్రెలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ, రైల్వే మంత్రి చేయాల్సిన పనిని ప్రచారం కోసం ప్రధాని చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన ఈ ప్రారంభోత్సవాలకు పెడుతున్న ఖర్చుతో మరో పెద్ద ప్రాజెక్టును ప్రారంభించవచ్చని ఆయన అన్నారు.

తెలంగాణ పట్ల తీవ్రమైన వివ‌క్ష చూపుతున్న మోడీ ఇక్కడికి షో చేయడానికివస్తున్నారని సతీష్ మండి పడ్డారు. మీడియా పబ్లిసిటీ తో ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

First Published:  8 April 2023 5:14 AM GMT
Next Story