Telugu Global
Telangana

ట్రయల్ రన్ సక్సెస్.. సెప్టెంబర్లో సైకిల్ ట్రాక్ ప్రారంభం

సెప్టెంబర్ రెండో వారంలో ఐటీ కారిడార్ సైకిల్ ట్రాక్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇది విజయవంతమైతే మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ట్రయల్ రన్ సక్సెస్.. సెప్టెంబర్లో సైకిల్ ట్రాక్ ప్రారంభం
X

హైదరాబాద్ లో 23 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చివరిగా సోలార్ ప్యానెళ్ల వినియోగానికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించారు. 23కిలోమీటర్ల పొడవున సోలార్ ప్యానెళ్లతో ఎల్ఈడీ లైట్లు అద్భుతంగా వెలుగులనిస్తున్నాయి. ఈ వెలుగు జిలుగులు సాయంత్రం వేళ ఆకట్టుకునేలా ఉంటాయని తెలిపారు HMDA కమిషనర్ అరవింద్ కుమార్. సైకిల్ ట్రాక్ ఫొటోలను ఆయన ట్విట్టర్లో ఉంచారు.


ట్రయల్ రన్ సక్సెస్..

కేవలం సైకిల్ ట్రాక్ కోసం ఓ దారి విడిచిపెట్టడం కొన్ని పట్టణాల్లో చూస్తూనే ఉంటాం. కానీ హైదరాబాద్ లో సైకిల్ ట్రాక్ ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు అధికారులు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్ కి సంబంధించి దీపాలు వెలిగేందుకు అక్కడే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలాంటి వ్యవస్థను తొలిసారిగా హైదరాబాద్ లో ప్రవేశపెట్టామంటున్నారు అధికారులు.

సెప్టెంబర్ లో ప్రారంభం..

సోలార్ సైకిల్ ట్రాక్ కి ఇరువైపులా అందమైన పూలమొక్కల్ని ఉంచారు. దారిపొడవునా ఆహ్లాదకరమైన వాతావరణంలో సైకిల్ ట్రాక్ ఉంటుంది. ఐటీ కారిడార్ లో ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఈ ట్రాక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎప్పుడెప్పుడు ఈ ట్రాక్ ప్రారంభిస్తారా అని ఐటీ ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇది విజయవంతమైతే మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ రెండో వారంలో ఐటీ కారిడార్ సైకిల్ ట్రాక్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

First Published:  16 Aug 2023 6:39 AM GMT
Next Story