Telugu Global
Telangana

సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌కు గంజాయి.. హైదరాబాద్‌లో లేడీ డాన్ అరెస్టు

నీతు బాయి గురించి సంచలన విషయాలు బయపెట్టారు పోలీసులు. నీతుబాయి రోజుకు రూ.20 లక్షలకుపైగా విలువైన గంజాయి అమ్ముతోందని గుర్తించారు.

సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీస్‌కు గంజాయి.. హైదరాబాద్‌లో లేడీ డాన్ అరెస్టు
X

చూడ్డానికి ఆమె సాధారణ మహిళ. కానీ, చేసేది మాత్రం లక్షల రూపాయల విలువైన గంజాయి దందా. సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయీసే ఆమె మెయిన్‌ టార్గెట్‌. తాజాగా నానక్‌రామ్‌గూడలో సైబరాబాద్‌ SOT పోలీసులు అరెస్టు చేసిన లేడీ డాన్‌ నీత బాయి స్టోరీ ఇది.

నానక్‌రామ్‌గూడలో దాడులు చేసిన SOT పోలీసులు.. నీతు బాయి దగ్గర 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. లేడీ డాన్‌ నీతుబాయిపై NDPS యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

నీతు బాయి గురించి సంచలన విషయాలు బయపెట్టారు పోలీసులు. నీతుబాయి రోజుకు రూ.20 లక్షలకుపైగా విలువైన గంజాయి అమ్ముతోందని గుర్తించారు. గత కొన్నేళ్లుగా సాగిస్తున్న గంజాయి అమ్మకం ద్వారా నీతుబాయి వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. గతంలో రెండు సార్లు గంజాయి విక్ర‌యిస్తూ పట్టుబడినప్పటికీ.. నీతుబాయిలో ఎలాంటి మార్పు రాలేదని అధికారులు చెప్తున్నారు.

First Published:  14 March 2024 8:43 AM GMT
Next Story