Telugu Global
Telangana

షి ఫర్ హర్.. మహిళల భద్రతకోసం మరో ముందడుగు

ఆమె కోసం ఆమె.. అంటే ఆమెను కాపాడుకోవడం కోసం ఆమెలాంటి వారు మరికొందరు అండగా నిలబడతారనమాట. షి టీమ్స్ అనే ప్రయోగం సక్సెస్ అయినట్టే షి ఫర్ హర్ కూడా విజయవంతం అవుతుందని అంటున్నారు పోలీసులు.

షి ఫర్ హర్.. మహిళల భద్రతకోసం మరో ముందడుగు
X

బాలికలు, యువతులు, మహిళల భద్రతకోసం.. సైబరాబాద్ పోలీసులు షీ టీమ్స్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షీ టీమ్స్ తో ఇప్పటికే చాలా చోట్ల మహిళలపై వేధింపులు తగ్గుముఖం పట్టాయి. షీ టీమ్స్ అండతో యువతులు పబ్లిక్ ప్లేసుల్లో ధైర్యంగా తిరగగలుగుతున్నారు. ఆకతాయిలకు ముకుతాడు పడింది. ఇప్పుడు మహిళల భద్రతలో సైబరాబాద్ పోలీస్ మరో ముందడుగు వేసింది. మహిళలకు భద్రత, సైబర్ భద్రత గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో “షి ఫర్ హర్” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు రాచకొండ పోలీసులు ప్రకటించారు. షి టీమ్స్‌ సభ్యులతో రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ మాట్లాడారు. భవిష్యత్తులో కళాశాల విద్యార్థుల కోసం ‘షి ఫర్‌ హర్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

షి ఫర్ హర్ అంటే ఏంటి..?

ఆమె కోసం ఆమె.. అంటే ఆమెను కాపాడుకోవడం కోసం ఆమెలాంటి వారు మరికొందరు అండగా నిలబడతారనమాట. షి టీమ్స్ అనే ప్రయోగం సక్సెస్ అయినట్టే షి ఫర్ హర్ కూడా విజయవంతం అవుతుందని అంటున్నారు పోలీసులు. దీనికోసం ఒక్కో కాలేజ్ నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థినులను ఎంపిక చేస్తారు. వారితో కలసి షి ఫర్ హర్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు.

బాలికలు, మహిళల కోసం అన్ని విద్యా సంస్థలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు సైబరాబాద్ పోలీసులు. ముఖ్యంగా విద్యా సంస్థలలో షి ఫర్ హర్ తో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలిపారు. సైబర్ నేరాలలో పురుషులతో పోల్చి చూస్తే మహిళలు త్వరగా మోసపోతున్నారని, దాన్ని అరికట్టేందుకు షి ఫర్ హర్ ఉపయోగపడుతుందని చెప్పారు.

First Published:  10 Jan 2023 4:54 PM GMT
Next Story