Telugu Global
Telangana

66 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన సైబ‌రాబాద్ పోలీసులు

వీరి వద్ద దేశంలోని 16.8 కోట్ల మందికి సంబంధించిన బ్యాంక్, పాన్‌కార్డ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలున్నట్లు పోలీసులు గుర్తించారు. డేటా చోరీలో బ్యాంక్, కాల్ సెంటర్లలోని ఉన్నత స్థాయి ఉద్యోగుల పాత్ర వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

66 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన సైబ‌రాబాద్ పోలీసులు
X

66 కోట్ల మంది వ్యక్తిగత డేటా లీక్ చేసిన‌ కేసులో కీలక వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 24 రాష్ట్రాల్లో, 8 మెట్రోపాలిటన్ సిటీల్లో డేటా చోరీ చేసిన ప్రధాన సూత్ర ధారి ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజ్ ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు.

డేటా చోరీ కోసం 6 మెట్రోపాలిటీన్ నగరాల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులను వినయ్ భరద్వాజ్ నియమించుకున్నాడు.

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, ఇన్‌స్టాగ్రామ్, జోమాటో, పాలసీ బజార్, బైజూస్ , వేదాంత , ఇన్‌కం ట్యాక్స్, డీమార్ట్, నీట్, పాన్ కార్డ్,డిఫెన్స్ అధికారులతో పాటు 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల డేటాను ఈ గ్యాంగ్ చోరీ చేసినట్లుగా గుర్తించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 4 కోట్ల మంది డేటాను చోరీ చేయగా.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 2.5 కోట్ల మంది, హైదరాబాద్ నగరానికి చెందిన కోటి మంది డేటాను వినయ్ భరద్వాజ్ చోరీ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

వీరి వద్ద దేశంలోని 16.8 కోట్ల మందికి సంబంధించిన బ్యాంక్, పాన్‌కార్డ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలున్నట్లు పోలీసులు గుర్తించారు. డేటా చోరీలో బ్యాంక్, కాల్ సెంటర్లలోని ఉన్నత స్థాయి ఉద్యోగుల పాత్ర వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ముంబై, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులని సమాచారం. జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నుంచి డేటా చోరీ అయినట్లుగా గుర్తించారు. దీంతో బ్యాంక్‌లతో పాటు జస్ట్ డయల్‌కి నోటీసులు ఇచ్చారు పోలీసులు.

First Published:  1 April 2023 11:45 AM GMT
Next Story