Telugu Global
Telangana

ఇన్వెస్ట్ మెంట్స్ పేరుతో కోట్లు లూటీ చేస్తున్న సైబర్ నేర‌గాళ్ళు

సైబరాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ డేటా 2022 ప్రకారం, ఇన్వెస్ట్ మెంట్స్ మోసాలకు సంబంధించిన దాదాపు 650 కేసులు (రూ. 22.60 కోట్లు లూటీ), ఆ తర్వాత 672 కస్టమర్ కేర్ మోసాలు,(రూ. 5.6 కోట్లు లూటీ), 572 అడ్వర్టైజ్‌మెంట్ మోసాల (రూ. 4.90 కోట్ల లూటీ)కు సంబంధించిన‌ కేసులు నమోదయ్యాయి.

ఇన్వెస్ట్ మెంట్స్ పేరుతో కోట్లు లూటీ చేస్తున్న సైబర్ నేర‌గాళ్ళు
X

సైబర్ మోసగాళ్లు ప్రజల నుండి సొమ్ము లూటీ చేయడానికి ఉపయోగిస్తున్న ప్రధానమైన విధానాలలో, ఇన్వెస్ట్ మెంట్స్, అడ్వటైజ్ మెంట్స్, కస్టమర్ కేర్ లుముఖ్యమైనవి.

సైబరాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ డేటా 2022 ప్రకారం, ఇన్వెస్ట్ మెంట్స్ మోసాలకు సంబంధించిన దాదాపు 650 కేసులు (రూ. 22.60 కోట్లు లూటీ), ఆ తర్వాత 672 కస్టమర్ కేర్ మోసాలు,(రూ. 5.6 కోట్లు లూటీ), 572 అడ్వర్టైజ్‌మెంట్ మోసాల (రూ. 4.90 కోట్ల లూటీ)కు సంబంధించిన‌ కేసులు నమోదయ్యాయి.

ఆన్‌లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించాలంటూ నకిలీ వెబ్‌సైట్ ద్వారా సైబర్ నేరస్తులు ఉచ్చులోకి లాగుతారు. బాధితుల ఫోన్లకు నేరుగా లింక్ పంపి, వాటిని ఉపయోగించి బ్యాంకు ఆధారాలను సేకరిస్తారు.

"మొదట చిన్న పెట్టుబడులకు లాభాలు ఇస్తారు. ఒక వ్యక్తి ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడు, మోసగాళ్ళు డబ్బును వసూలు చేసి లాగ్ అవుట్ చేస్తారు" అని సైబరాబాద్ పోలీస్ డిసిపి (సైబర్ క్రైమ్ వింగ్) రితిరాజ్ అన్నారు. కస్టమర్ కేర్ మోసాలలో బాధితులు నిజమైన వెబ్‌సైట్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు తమ నకిలీ వెబ్‌సైట్ లు క‌నిపించే విధంగా నిందితులు ‘బూస్టర్‌లను’ ఉపయోగిస్తున్నారు.

గతంలో జార్ఖండ్ లోని జమ్తారా, రాజస్తాన్ లోని భరత్‌పూర్ ముఠాలు ఎక్కువగా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడేవి. ఇప్పుడు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, రాజస్థాన్ నుండి కొత్త బృందాలు సైబర్ నేరాలు చేస్తున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. “బీహార్‌లోని నలంద, కత్రిసరాయ్, వార్స్లీ నుండి ఇప్పుడు కొత్త ముఠాలు చురుకుగా పనిచేస్తున్నాయి. ఘజియాబాద్, మీరట్ నుండి కూడా సైబర్ ముఠాలు పనిచేస్తున్నాయి.

ఈ ముఠాలు స్థానికంగా ఎటువంటి నేరాలు చేయవు. అందువల్ల స్థానిక పోలీసులకు వారి గురించి తెలియదు, ”అని డిసిపి చెప్పారు.

First Published:  3 March 2023 3:13 AM GMT
Next Story