Telugu Global
Telangana

కొడంగల్‌ రోడ్లకు రూ.213 కోట్లు.. ఇదేం న్యాయం రేవంత్‌..!

రేవంత్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగల్‌ అభివృద్ధి కోసం అథారిటీని ఏర్పాటు చేశారు. యాదగిరి గుట్టకు మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్‌కు తరలించినట్లు వార్తలు కూడా వచ్చాయి.

కొడంగల్‌ రోడ్లకు రూ.213 కోట్లు.. ఇదేం న్యాయం రేవంత్‌..!
X

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలో రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 213 కోట్లు మంజూరు చేసింది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 30 బీటీ రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.213 కోట్లు మంజూరు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం మూడు నియోజకవర్గాలు గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే బాగుపడ్డాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తామంటూ హామీలు ఇచ్చారు. మ‌రిప్పుడు రేవంత్ చేస్తున్న ప‌నికి ఏం స‌మాధానం చెబుతార‌ని ప‌లువురు ప్ర‌శ్‌నిస్తున్నారు.

ఇటీవ‌ల‌ రేవంత్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగల్‌ అభివృద్ధి కోసం అథారిటీని ఏర్పాటు చేశారు. యాదగిరి గుట్టకు మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్‌కు తరలించినట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా రోడ్ల కోసం రూ.213 కోట్లు రిలీజ్ చేయడంతో.. సెటైర్లు పేలుతున్నాయి. మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

First Published:  11 Feb 2024 7:32 AM GMT
Next Story