Telugu Global
Telangana

బాల్క సుమన్‌పై క్రిమినల్ కేసు.. అరెస్టు తప్పదా..?

మంచిర్యాలలో నిర్వహించిన BRS పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్‌.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

బాల్క సుమన్‌పై క్రిమినల్ కేసు.. అరెస్టు తప్పదా..?
X

బీఆర్ఎస్ లీడర్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం సహా నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారంటూ బాల్క సుమన్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు సైతం బాల్క సుమన్‌ తీరుపై మండిపడుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో సుమన్‌ను తిరగనివ్వమంటూ హెచ్చరిస్తున్నారు.

మంచిర్యాలలో నిర్వహించిన BRS పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్‌.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ.. చెప్పు తీసి చూపించారు. కానీ, తనకు సంస్కారం అడ్డువస్తుందంటూ కామెంట్స్ చేశారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

First Published:  6 Feb 2024 2:29 AM GMT
Next Story