Telugu Global
Telangana

నువ్వెవడివి... కోన్ కిస్కా... బండి సంజయ్ పై నారాయణ ఫైర్

సీపీఐ నేత నారాయణ బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ పై మండిపడ్డారు. మునుగోడులో కమ్యూనిస్టులు పోటీ చేయొద్దనడానికి నువ్వెవరు ? అని ఆయన ప్రశ్నించారు

నువ్వెవడివి... కోన్ కిస్కా... బండి సంజయ్ పై నారాయణ ఫైర్
X

మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు పోటీ చేయరాదనడానికి బండి సంజయ్ ఎవరని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయాలా, వద్దా అన్న విషయం తేల్చుకోవలసింది తామేనని ఆయన చెప్పారు. దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే హక్కు మీకు లేదని, నువ్వెవడివి కోన్ కిస్కా అని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. 'మీరు అతిగా మాట్లాడుతున్నారు. 'దమ్ము' అన్న మాట బ్రిటిష్ పాలకుల నుంచి.. ఆ తరువాత ఢిల్లీ నుంచి వచ్చింది. ఇప్పుడు మీకు చేరింది.. అసలు దమ్ము, ధైర్యం అన్న భాష సంఘ వ్యతిరేక శక్తులు వాడే భాష ' అని ఆయన అన్నారు. మునుగోడు ఎన్నికలో పోటీపై తాము జిల్లా నేతలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అందరి ఆమోదంతో.. ఇక్కడ పోటీ చేయాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటాం అని చెప్పారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు. పగటి కలలు కనడం మానండి అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో పోటీపై వామపక్షాల కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోవచ్ఛునని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో లెఫ్ట్ పార్టీల కేడర్ బలంగానే ఉంది. ఇక్కడ గతంలో.. 2004 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పల్లా వెంకటరెడ్డి, ఆ తరువాత 2009 లో ఇదే పార్టీ అభ్యర్థి ఉజ్జిని యాదగిరి రావు విజయం సాధించి కమ్యూనిస్టు పతాకాన్ని ఎగరేశారు. అయితే రాష్ట్రవిభజన తరువాత ఇక్కడి రాజకీయ పరిణామాలు మారాయి. 2014 లో టీఆరెస్ విజయం సాధించింది. ఇప్పుడు జరగబోయే ఉపఎన్నికలో తమ పార్టీకి మద్దతునివ్వాలని సీఎల్ఫీ నేత భట్టి

విక్రమార్క .. సీపీఐ నేతలను కోరుతున్నారు. కానీ ఇప్పటివరకు సీపీఐ ఏ విషయం వెల్లడించకుండా సస్పెన్స్ లో పెట్టింది. బహుశా ఏ పార్టీకి మద్దతునివ్వకుండానే ఒంటరిగా పోటీ చేసినా చేయవచ్చునన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పార్టీ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిచ్చేవిగా ఉన్నాయని అంటున్నారు.




First Published:  12 Aug 2022 4:29 AM GMT
Next Story