Telugu Global
Telangana

బీఆర్ఎస్ నాయకులపై ఈడీ దాడులు బీజేపీ కుట్రలో భాగమే : సీపీఐ నారాయణ

ప్రస్తుతం బీఆర్ఎస్, ఆప్ నాయకులపై జరుగుతున్న దాడులన్నీ అందులో భాగమేనని.. ఇదంతా బీజేపీ కుట్ర అని నారాయణ అన్నారు.

బీఆర్ఎస్ నాయకులపై ఈడీ దాడులు బీజేపీ కుట్రలో భాగమే : సీపీఐ నారాయణ
X

అదానీ మాయల ఫకీరు కంటే దారుణంగా తయారయ్యాడని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ప్రభుత్వ సంస్థల నుంచి అధిక మొత్తంలో పెట్టుబడులు అదానీ సంస్థలకు కేంద్రమే బదిలీ చేసిందని ఆరోపించారు. సెబీ, సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలన్నీ అదానీ సంస్థలను కుక్కలెక్క కాపలా కాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ మాత్రం ఈ దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను భయపెట్టడానికి ఉపయోగిస్తోందని ఆరోపించారు.

ప్రస్తుతం బీఆర్ఎస్, ఆప్ నాయకులపై జరుగుతున్న దాడులన్నీ అందులో భాగమేనని.. ఇదంతా బీజేపీ కుట్ర అని నారాయణ అన్నారు. బీజేపీ నాయకులు రేప్‌లు చేసినా పూల మాలలు వేసి బయట తిప్పుతున్నారని నారాయణ మండిపడ్డారు. దేశం ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నదని.. బీజేపీని వ్యతిరేకించే పార్టీల అవసరం ఇప్పుడు ఉందన్నారు. బీఆర్ఎస్ మొదట్లో బీజేపీతో కలిసి పని చేసినా.. ఇప్పుడు మాత్రం దానికి వ్యతిరేకంగానే ఉన్న విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీతో సీపీఐ జత కలుస్తున్నాయని ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అవన్నీ అబద్దాలే అని.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో గానీ, రేవంత్ రెడ్డితో గానీ మాకు విభేదాలు లేవని అన్నారు. సీపీఐ పార్టీ అధికారంలోకి రావాలని.. నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులు కావాలని మాకూ ఉంటుంది. అలాగని ఇష్టమొచ్చినట్లు పొత్తులు పెట్టుకోమని నారాయణ స్పష్టం చేశారు.

లోకేశ్‌ను పప్పు అని ఏపీ సీఎం జగన్ అంటున్నారు. మరి అలాంటి పప్పు సుద్ద పాదయాత్ర చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని నారాయణ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో చంద్రబాబు ముసలోడు. మరి ఆ ముసలోడి రోడ్ షోలకు ఆటంకాలు ఎందుకు సృష్టిస్తున్నారని నారాయణ అన్నారు.

First Published:  22 Feb 2023 11:54 AM GMT
Next Story