Telugu Global
Telangana

అమిత్ షా క్రిమినల్, మీరు ఆయన బానిసలు ..ఈటల రాజేందర్ పై నారాయణ ఫైర్

అమిత్ షా 12 మందిని హత్య చేయించిన క్రిమినల్ అని సీపీఐ నేత నారాయణ ద్వజమెత్తారు. ఈ రాష్ట్ర బీజేపీనేతలు ఆయన చెప్పులు మోసే బానిసలని ఆయన ఆరోపించారు.

అమిత్ షా క్రిమినల్, మీరు ఆయన బానిసలు ..ఈటల రాజేందర్ పై నారాయణ ఫైర్
X

నిన్న మునుగోడులో జరిగిన బహిరంగ సభలో బీజేపీ నేత ఈటల రాజేందర్ కమ్యూనిస్టులను విమర్షించడం పట్ల సీపీఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. అమిత్ షా ఓ క్రిమినల్, ఓ కేసులో 12 మంది సాక్షులను, లాయర్లను హత్య చేయించాడు. అలాంటి క్రిమినల్ చెప్పులు మోసే మీకు మా గురించి మాట్లాడే అర్హత లేదని నారాయణ ద్వజమెత్తారు.

బీజేపీని ఓడించేందుకు మేము దయ్యంతోనైనా కలిసి పని చేస్తాం.... కేసీఆర్ తోనే కాదు ఎవరితోనైనా సరే కలిసి పని చేస్తాం. ఈ దేశాన్ని ధ్వంసం చేస్తున్న మిమ్మల్ని ఓడించడమే మా లక్ష్యం అని నారాయణ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నందుకు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. ఈడీ, సీబీఐ దాడులకు పాల్పడుతున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు అని నారాయణ మండిపడ్డారు. ''మీరు చెప్పులు మోసుకుంటూ తిరగండి, మీ శక్తికి మించి మాట్లాడకండి'' అని నారాయణ బీజేపీ నాయకులకు హితవు పలికారు.

Next Story