Telugu Global
Telangana

ఆ ఎంపీ సీటు ఇవ్వండి.. పోటీ చేస్తాం - కాంగ్రెస్‌కు సీపీఐ విజ్ఞప్తి

ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో తమకు బలం ఉందని.. ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలోని నల్గొండ, భువనగరి, ఖమ్మం, వరంగల్‌ స్థానాల్లో ఏదో ఒక పార్లమెంట్ స్థానాన్ని తమకు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరుతోంది సీపీఐ.

ఆ ఎంపీ సీటు ఇవ్వండి.. పోటీ చేస్తాం - కాంగ్రెస్‌కు సీపీఐ విజ్ఞప్తి
X

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ పోటీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐకి కొత్తగూడెం స్థానం కేటాయించగా.. ఆ స్థానంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ‌రావు విజయం సాధించారు. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగనుంది. జాతీయ స్థాయిలోనూ ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. దీంతో తెలంగాణలో తమకు ఒక ఎంపీ స్థానం ఇవ్వాలని సీపీఐ కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది.

ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో తమకు బలం ఉందని.. ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలోని నల్గొండ, భువనగరి, ఖమ్మం, వరంగల్‌ స్థానాల్లో ఏదో ఒక పార్లమెంట్ స్థానాన్ని తమకు కేటాయించాలని కాంగ్రెస్‌ను కోరుతోంది సీపీఐ. ఇటీవల సీఎం రేవంత్‌ను కలిసిన టైమ్‌లోనూ సీపీఐ ప్రతినిధి బృందం ఈ ప్రతిపాదనను ఆయన ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అధిష్టానంతో చర్చించిన తర్వాతే అంటూ ఆయన ఈ ప్రతిపాదనను దాటవేసినట్లు సమాచారం.

పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని సీపీఐకి హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. ఆ సమయంలో ఎంపీ సీట్ల పంపకాల ప్రస్తావన రాలేదు. అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు 10 నుంచి 12 స్థానాల్లో గెలవాలని పట్టుదలతో ఉన్న హస్తం పార్టీ సీపీఐకి సీటు ఇస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.

First Published:  4 Jan 2024 3:29 PM GMT
Next Story