Telugu Global
Telangana

తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది - మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

కేంద్రం కొర్రీలు పెడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో అభివృద్ధిలో వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తున్నామని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మనఊరు-మనబడి కార్యక్రమం అద్భుతంగా ఉందని..ఇంకా మెరుగ్గా విద్యను అందించాలన్నారు.

తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది - మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
X

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన విద్యాదినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రం కొర్రీలు పెడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో అభివృద్ధిలో వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తున్నామని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మనఊరు-మనబడి కార్యక్రమం అద్భుతంగా ఉందని..ఇంకా మెరుగ్గా విద్యను అందించాలన్నారు. విద్యాశాఖకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరినీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందరర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి తన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాలల్లో ఓ పీరియడ్ స్టోర్ట్స్ కోసం కేటాయించాలని, పీఈటీలను నియ‌మించాల‌ని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సభాముఖంగా కోరారు.

First Published:  20 Jun 2023 4:20 PM GMT
Next Story