Telugu Global
Telangana

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అతి తక్కువ అవినీతి.... సర్వే రిపోర్ట్

అవినీతి అనేది కీలకమైన ఎన్నికల సమస్యనా, కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన సర్వే, అవినీతి, ఓటర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది, ఈ అంశంలో రాజకీయ పార్టీలపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని తేల్చింది. అయితే ప్రజలు ఓట్లు వేయడానికి, వేయకపోవడానికి అవినీతి ప్రధాన సమస్య కావడంలేదు.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అతి తక్కువ అవినీతి.... సర్వే రిపోర్ట్
X

ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అవినీతి చాలా తక్కువగా ఉందని, కేవలం 23 శాతం మంది ఓటర్లు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని నమ్ముతున్నారని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) లోక్ నీతి ప్రోగ్రామ్ ఫర్ కంపారిటివ్ డెమోక్రసీ సర్వేలో తేలింది. .

అవినీతి అనేది కీలకమైన ఎన్నికల సమస్యనా, కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన సర్వే, అవినీతి, ఓటర్లను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది, ఈ అంశంలో రాజకీయ పార్టీలపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని తేల్చింది. అయితే ప్రజలు ఓట్లు వేయడానికి, వేయకపోవడానికి అవినీతి ప్రధాన సమస్య కావడంలేదు.

ఈ నాలుగేళ్ళ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన‌ 13 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా 12 రాష్ట్రాల్లో ప్రజలు తమ రాష్ట్రంలో అవినీతి పెరిగిందని చెప్పారు.

ఈ 12 రాష్ట్రాలలో ఆరింటిలో, అధికార పార్టీ లేదా కూటమి తిరిగి ఎన్నికైంది, మిగిలిన ఆరింటిలో అది అధికారానికి దూరమైంది. అవినీతి తగ్గిందని ఎక్కువ మంది ఓటర్లు (31.4 శాతం) విశ్వసించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.

గత నాలుగు సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు, తరువాత నిరంతర ప్రక్రియగా సాగిన ఈ సర్వేలో ఒక్క తెలంగాణలో మాత్రమే పౌరులు అవినీతి తగ్గిందని అభిప్రాయపడ్డారు.

పంజాబ్ రాష్ట్రంలో అవినీతి పెరిగిందని 69 శాతం మంది విశ్వసించగా, మధ్యప్రదేశ్‌లో 67 శాతం, గోవా 59 శాతం, కర్నాటక 58 శాతం, రాజస్థాన్ 57 శాతం, గుజరాత్ 53 శాతం ఉన్నాయి.

తెలంగాణలో రోడ్ల పరిస్థితి మెరుగుపడిందని 51.7 శాతం మంది అభిప్రాయపడగా, విద్యుత్ సరఫరా మెరుగుపడిందని 84.7 శాతం మంది అభిప్రాయపడ్డారు.

60 శాతానికి పైగా ప్రజలు తాగునీటి సరఫరా మెరుగుపడిందని చెప్పారు. తెలంగాణలో కీలకమైన ప్రభుత్వ పథకాలపై అవగాహన చాలా ఎక్కువగా ఉందని, 94.9 శాతం మంది ప్రజ‌లు రైతు బంధు, కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ (95.8 శాతం) అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ (93.2 శాతం), 2BHK పథకం (93.8శాతం) ఆరోగ్యశ్రీ (96.6 శాతం) గురించి విన్నారు. ఇవి కూడా గత ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించాయి.

First Published:  31 March 2023 3:26 AM GMT
Next Story