Telugu Global
Telangana

కరప్ట్‌ వర్కింగ్ కమిటీ-CWC.. సిటీలో పోస్టర్ల కలకలం

కరప్ట్‌ వర్కింగ్ కమిటీ అంటూ సిటీలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో కాంగ్రెస్‌ నేతల ఫొటోలతో పాటు యూపీఏ హయాంలో జరిగిన పలు కుంభకోణాలను ప్రచురించారు.

కరప్ట్‌ వర్కింగ్ కమిటీ-CWC.. సిటీలో పోస్టర్ల కలకలం
X

హైదరాబాద్‌ తాజ్‌కృష్ణ వేదికగా నేడు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అగ్ర నేతలు సహా 300 మంది అతిథులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సిటీలోని పలు ప్రాంతాల్లో రాత్రికి రాత్రే అంటించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

కరప్ట్‌ వర్కింగ్ కమిటీ అంటూ సిటీలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో కాంగ్రెస్‌ నేతల ఫొటోలతో పాటు యూపీఏ హయాంలో జరిగిన పలు కుంభకోణాలను ప్రచురించారు. మొత్తం 24 మంది కాంగ్రెస్ నేతల ఫొటోలను ముద్రించి వారిపై ఉన్న అవినీతి ఆరోపణలను పోస్టర్లలో ప్రస్తావించారు. బీ వేర్ ఆఫ్ స్కాంగ్రెస్‌ స్కామర్స్ అంటూ పోస్టర్లు అతికించారు.

ఈ పోస్టర్లు అతికించింది ఎవరనేది మిస్టరీగా మారింది. బీఆర్ఎస్ నేతల పనేనని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక గతంలో సిటీలో మోడీ పర్యటన, అమిత్ షా సభల సందర్భంగానూ ఇలాంటి పోస్టర్లు వెలిశాయి.

First Published:  16 Sep 2023 3:12 AM GMT
Next Story