Telugu Global
Telangana

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు ...హైదరాబాద్ లోనే అధికం

తెలంగాణలో గత 24 గంటల్లో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో హైదరాబాద్ లోనే 19 కేసులున్నాయి. కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన 41 మందిలో 30 మంది డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు ...హైదరాబాద్ లోనే అధికం
X

తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళలో కేసులు అధికంగా నమోదవుతునప్పటికీ, తెలంగాణలో కూడా కొద్ది రోజులుగా కేసులు పెరుగుతున్నాయి.

తెలంగాణలో గత 24 గంటల్లో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో హైదరాబాద్ లోనే 19 కేసులున్నాయి. కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన 41 మందిలో 30 మంది డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం... హైదరాబాద్ లో వారం రోజులుగా కేసుల సంఖ్యను చూస్తే.. 11వ తేదీన 12 కేసులు నమోదయ్యాయి. 12వ తేదీన- 14, 13వ తేదీన- 18, 14వ తేదీన- 19, 15వ తేదీన 8, 16వ తేదీన- 12, 17వ తేదీన 19 కేసులు నమోద‌య్యాయి.

ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,43,003కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారు 8,38,623 మంది ఉన్నారు. 4,111 మంది మృత్యువాత పడ్డారు.

అటు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 9,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మంది మృత్యువాత పడ్డారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313గా నమోదైంది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,31,141కి పెరిగింది.

నిన్న అత్యధికంగా గుజరాత్‌లో ఆరు మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో నలుగురు, ఢిల్లీ, రాజస్థాన్‌లల్లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బిహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, తమిళనాడుల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

First Published:  18 April 2023 9:09 AM GMT
Next Story