Telugu Global
Telangana

సీఐ మర్మాంగాలు కోసేసిన కానిస్టేబుల్‌..!

మహబూబ్‌నగర్‌లోని సీసీఎస్‌ (సెంట్రల్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌) సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌ అదే స్టేషన్‌లోని కానిస్టేబుల్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం.

సీఐ మర్మాంగాలు కోసేసిన కానిస్టేబుల్‌..!
X

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ కానిస్టేబుల్‌.. సీఐపై దాడి చేశాడు. అతని మర్మాంగాలు కోసేసి తీవ్రంగా గాయపరిచాడు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌లోని సీసీఎస్‌ (సెంట్రల్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌) సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌ అదే స్టేషన్‌లోని కానిస్టేబుల్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. కానిస్టేబుల్‌ భార్య కూడా మహబూబ్‌నగర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. వివాహేతర సంబంధం విషయం సదరు భర్తకు తెలియడంతో అతను సీఐపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. గురువారం తెల్లవారుజామున సీఐపై దాడికి పాల్పడ్డాడు. సీఐని ఈ సందర్భంగా తీవ్రంగా గాయపరచిన కానిస్టేబుల్‌ కత్తితో అతని మర్మాంగాలు కోసేసినట్టు తెలిసింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈఎస్ ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి డీఐజీ, ఎస్పీ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు ధ్రువీకరించారని తెలుస్తోంది. ఈ సంఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.

First Published:  2 Nov 2023 9:21 AM GMT
Next Story