Telugu Global
Telangana

కాంగ్రెస్‌ గెలవదు- కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాల్సిందిగా ఆయన ఒక ఆడియోను కూడా బయటకు వదిలారు. ఇప్పుడు ఏకంగా పార్టీ గెలవదని ప్రకటించడం కలకలం రేపుతోంది.

కాంగ్రెస్‌ గెలవదు- కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఆయన.. అక్కడ తన స్నేహితులు, కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మునుగోడులో కాంగ్రెస్ గెలవదని స్పష్టం చేశారు.

ఇప్పటికే తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాల్సిందిగా ఆయన ఒక ఆడియోను కూడా బయటకు వదిలారు. ఇప్పుడు ఏకంగా పార్టీ గెలవదని ప్రకటించడం కలకలం రేపుతోంది. మునుగోడులో తాను ప్రచారానికి వెళ్లినా ప్రయోజనం లేదని.. ఒకవేళ తాను ప్రచారానికి వెళ్తే కొన్ని ఓట్లు పెరుగుతాయే గానీ గెలుపు మాత్రం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. 25ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. ప్రస్తుత రాజకీయాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అవసరమైతే రాజకీయాలను నుంచి రిటైర్మెంట్‌ తీసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పారు.

First Published:  22 Oct 2022 5:03 AM GMT
Next Story