Telugu Global
Telangana

కాంగ్రెస్‌ బస్సు యాత్ర.. త్వరలోనే షెడ్యూల్‌..!

అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో మొదలుపెట్టి.. దాదాపు 10-12 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందని తెలుస్తోంది. రూట్‌ మ్యాప్, షెడ్యూల్ త్వరలోనే ఫైనల్ చేయనున్నారు.

కాంగ్రెస్‌ బస్సు యాత్ర.. త్వరలోనే షెడ్యూల్‌..!
X

తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతోంది హస్తం పార్టీ. వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో ఈ యాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా ఈ యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు ఉత్తమ్‌, రేవంత్ ఢిల్లీలోనే ఉండటంతో.. అక్కడే రెండు రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయాలని నిర్ణయించారు. షార్ట్ లిస్టును అధిష్టానానికి ఇవ్వాలని భావించారు. కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్‌తో ఎంపీలిద్దరూ బుధవారం సభలోనే ఉండిపోయారు. లోక్‌సభ నుంచి వచ్చాక స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, ఠాక్రే, భట్టితో రేవంత్, ఉత్తమ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. సోనియా ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించారు.

అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో మొదలుపెట్టి.. దాదాపు 10-12 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందని తెలుస్తోంది. రూట్‌ మ్యాప్, షెడ్యూల్ త్వరలోనే ఫైనల్ చేయనున్నారు. ఇక ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీలో మరో ఇద్దరికి చోటు కల్పించారు. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను కమిటీలోకి తీసుకున్నారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.

*

First Published:  21 Sep 2023 3:00 AM GMT
Next Story