Telugu Global
Telangana

10 రోజులు.. 100 నియోజకవర్గాలు.. కాంగ్రెస్‌ మరో బస్సు యాత్ర..!

ఉత్తర తెలంగాణ నుంచి ఒక బస్సు.. దక్షిణ తెలంగాణ నుంచి మరో ర్యాలీ ప్రారంభం కానుంది. పది రోజుల్లో వంద నియోజకవర్గాలు చుట్టేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.

10 రోజులు.. 100 నియోజకవర్గాలు.. కాంగ్రెస్‌ మరో బస్సు యాత్ర..!
X

తెలంగాణలో పోలింగ్ దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్‌ మరో బస్సు యాత్రకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ సమస్యను హైలైట్ చేసేలా నిరుద్యోగ యువత ఎక్స్‌ప్రెస్‌ పేరిట బస్సు యాత్రను నిర్వహించాలని ప్లాన్ చేసింది హస్తం పార్టీ.

ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్‌ వస్తే ఒకటి, రెండు రోజుల్లో ఈ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ బస్సు యాత్రకు కన్వీనర్‌గా టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్‌ను నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తర తెలంగాణ నుంచి ఒక బస్సు.. దక్షిణ తెలంగాణ నుంచి మరో ర్యాలీ ప్రారంభం కానుంది. పది రోజుల్లో వంద నియోజకవర్గాలు చుట్టేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఒక్కో బస్సు 50 నియోజకవర్గాలను చుట్టేయనుంది. ఈ బస్సు యాత్రను ప్రొఫెసర్ హరగోపాల్‌, కోదండరామ్ పాల్గొని ప్రారంభించనున్నారు. AICC చీఫ్‌ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ బస్సు యాత్రకు హాజరుకానున్నారు.

First Published:  15 Nov 2023 2:47 AM GMT
Next Story