Telugu Global
Telangana

కెసిఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్ర‌శంస‌లు

సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రారంభించినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించారు. కేసీఆర్ ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారని అన్నారు జగ్గారెడ్డి.

కెసిఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్ర‌శంస‌లు
X

ముఖ్య‌మంత్రి కెసిఆర్ పై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు. ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న ముఖ్య‌మంత్రి కెసిఆర్ అని ఆయ‌న కొనియాడారు. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చారని... ఇప్పుడు ఆయ‌న ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారని చెప్పారు.

మెడిక‌ల్ కాలేజీ కోసం తన పోరాటం ఫలించి సంగారెడ్డికి మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ మంజూరుచేసారని... ఇప్పుడు అదే కాలేజీ ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన మాట ప్ర‌కారం కాలేజీ ని ఏర్పాటు చేసినందుకు సంగారెడ్డి ప్రజల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేగా త‌న ప‌క్షాన సిఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

ఇక్క‌డ మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు కావ‌డం వ‌ల్ల ఈ ప్రాంత ప్ర‌జ‌లకు మంచి వైద్య స‌దుపాయాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. జిల్లా ప్ర‌జ‌లు ఇక మెరుగైన వైద్య సేవ‌ల కోసం హైద్రాబాద్ ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన బాధ ఉండ‌ద‌న్నారు.

నేడు సంగారెడ్డి మెడికల్ కాలేజీతో పాటుమహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, రామగుండంలలో మొత్తం 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ నుండి వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు.

Next Story