Telugu Global
Telangana

కాంగ్రెస్ లో హోం గార్డ్ లు లేరు, ఐపీఎఎస్ లు లేరు..

వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే ఆయన కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని చెప్పారు జగ్గారెడ్డి. సమయం వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న మెడిసిన్ బయట పెడతానన్నారు.

కాంగ్రెస్ లో హోం గార్డ్ లు లేరు, ఐపీఎఎస్ లు లేరు..
X

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - హోంగార్డు వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపింది. అద్దంకి దయాకర్, రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినా వెంకట్ రెడ్డి తగ్గేది లేదంటున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా కాంగ్రెస్ హోంగార్డ్ ని అని మెన్షన్ చేసి ఆ తర్వాత ఆ పదం తీసేశారు వెంకట్ రెడ్డి. అంటే హోంగార్డ్ అనే మాటతో ఆయన ఎంతగా ఫీలయ్యారో అర్థమవుతోంది. తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా హోంగార్డ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ఎవరూ హోంగార్డ్ లు కారని, ఐపీఎస్ లు కూడా కాదని అన్నారాయన. తామంతా కాంగ్రెస్ సైనికులం అని చెప్పారు. అధిష్టానమే తమకు బాస్ అని చెప్పారు జగ్గారెడ్డి.

నా దగ్గర మెడిసిన్ ఉంది..

మునుగోడు ఉప ఎన్నిక వేళ, తన దగ్గర ఉన్న మెడిసిన్ బయటకు తీసి కాంగ్రెస్ పార్టీ గెలుపున‌కు కృషి చేస్తానన్నారు జగ్గారెడ్డి. ఎవరు పిలిచినా, పిలవకపోయినా తాను మునుగోడు ప్రచారానికి వెళ్తానన్నారు. తన తరఫున పార్టీ గెలుపుకోసం పనిచేస్తానని చెప్పారు. వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే ఆయన కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని చెప్పారు జగ్గారెడ్డి. సమయం వచ్చినప్పుడు తన దగ్గర ఉన్న మెడిసిన్ బయట పెడతానన్నారు.

ప్రియాంక ఇన్‌చార్జిగా వస్తే హ్యాపీ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కి ప్రియాంక గాంధీ ఇన్‌చార్జ్ గా వస్తే సంతోషిస్తామన్నారు జగ్గారెడ్డి. రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి వ్యవహారాలపై నో కామెంట్స్ అని తేల్చేశారు. బండి సంజయ్ కోతల రాయుడని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో ఈసారి బీజేపీ గెలవదని జోస్యం చెప్పారు. హుజూరాబాద్ లో ఓడిపోతాననే భయంతోనే ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తాన‌ని చెబుతున్నారని, ఈటలకు కూడా ఓటమి భయం పట్టుకుందని అన్నారు. మునుగోడులో కాంగ్రెస్ విజయం ఖాయమని చెప్పారు జగ్గారెడ్డి.

First Published:  15 Aug 2022 2:09 AM GMT
Next Story