Telugu Global
Telangana

చెప్పిందొకటి.. చేసేదొకటి.. ఇదే కాంగ్రెస్ రీతి, నీతి - కేటీఆర్

పార్టీ ఫిరాయింపులపై నిన్న నీతులు మాట్లాడి.. ఇవాళ సిగ్గులేకుండా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు కండువా కాంగ్రెస్ కప్పారన్నారు కేటీఆర్. ఇచ్చిన హామీలకు అర్థం లేనప్పుడు ఈ డ్రామాలెందుకు అంటూ ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్.

చెప్పిందొకటి.. చేసేదొకటి.. ఇదే కాంగ్రెస్ రీతి, నీతి - కేటీఆర్
X

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే తెల్లం కాంగ్రెస్‌లో చేరడంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రంలో అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులపై కఠిన చట్టం తీసుకువస్తామని తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు కేటీఆర్.

పార్టీ ఫిరాయింపులపై నిన్న నీతులు మాట్లాడి.. ఇవాళ సిగ్గులేకుండా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు కండువా కాంగ్రెస్ కప్పారన్నారు కేటీఆర్. ఇచ్చిన హామీలకు అర్థం లేనప్పుడు ఈ డ్రామాలెందుకు అంటూ ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. గెలిచేంత వరకు ఒక మాట.. గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. ఇక బీజేపీకి, కాంగ్రెస్‌కు తేడా ఏంటని ప్రశ్నించారు.


అసెంబ్లీ ఎన్నికల ముందు చివరి నిమిషంలో పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావుకు భద్రాచలం టికెట్ కేటాయించింది బీఆర్ఎస్. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై విజయం సాధించారు తెల్లం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లోకి వెళ్లిన తెల్లం.. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. శనివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన తెల్లం.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

First Published:  7 April 2024 11:17 AM GMT
Next Story