Telugu Global
Telangana

అప్లికేషన్లు మాకెందుకు.. మా 2 టికెట్లు మావే

తాను పార్టీ మారడంలేదని, 30 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశానని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పనిలో పనిగా హుజూర్ నగర్, కోదాడ సీట్లు రెండూ తన కుటుంబానివే అని ప్రకటించేశారు.

అప్లికేషన్లు మాకెందుకు.. మా 2 టికెట్లు మావే
X

తెలంగాణలో అసెంబ్లీ సీటు కావాలంటే ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే. పార్టీ అధ్యక్షుడినయినా తనకు కూడా అప్లికేషన్ తప్పదు అంటూ రేవంత్ రెడ్డి ఇటీవల గంభీరంగా ప్రకటించారు. కాంగ్రెస్ లో అన్నీ పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. అయితే అప్లికేషన్ల గొడవలేవీ లేకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు సీట్లు కన్ఫామ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను హుజూర్ నగర్ నుండి, తన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు ఉత్తమ్.

ఆ రెండు సీట్లు మాకే..

పార్టీ మార్పు వార్తలను ఖండించే క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను పార్టీ మారడంలేదని, 30 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశానని చెప్పారు ఉత్తమ్. పనిలో పనిగా హుజూర్ నగర్, కోదాడ సీట్లు రెండూ తన కుటుంబానివే అని ప్రకటించేశారు.


అంటే అప్లికేషన్లు..?

ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కుటుంబానికి రెండు సీట్లు ప్రకటించుకున్నారు. ఆయన లాగే మిగతా సీనియర్లు కూడా తమ సీట్లు కన్ఫామ్ చేసుకుంటున్నారు. అంటే అప్లికేషన్లు అనేది పూర్తిగా డూప్ షాట్ వ్యవహారం అని తేలిపోతోంది. అప్లికేషన్లు పెట్టుకుంటే అర్హత ప్రకారం అధిష్టానం సీట్లు ఖరారు చేస్తుంది అనేది పైకి జరుగుతున్న ప్రచారం. కానీ ఆల్రడీ సీట్లు కన్ఫామ్ చేసిన తర్వాతే అప్లికేషన్లు తీసుకుంటున్నారనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్.

First Published:  20 Aug 2023 5:34 AM GMT
Next Story