Telugu Global
Telangana

నేటి నుంచి తెలంగాణలో ప్రియాంక పర్యటన.. షెడ్యూల్ ఇదే

మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొంటారు. రాత్రి ఖమ్మంకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు.

నేటి నుంచి తెలంగాణలో ప్రియాంక పర్యటన.. షెడ్యూల్ ఇదే
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్‌కు కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో తమ పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించేందుకు ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రాష్ట్రానికి క్యూ క‌డుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇదివరకే బ‌హిరంగ స‌భ‌లు, రోడ్ షోల‌తో ప్ర‌చారం నిర్వ‌హించినా.. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో నేడు మరోసారి ఆమె రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు ఆమె ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆమె హుస్నాబాద్ కు చేరుకొని అక్కడ ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగూడెంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొంటారు. రాత్రి ఖమ్మంకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు.

ఇక రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరులో ప్రియాంక గాంధీ ఎన్నిక‌ల‌ ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం ఆమె అక్కడి నుంచి సత్తుపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ప్రియాంక గాంధీ 2:40 గంటలకు మధిరకు చేరుకొని అక్కడ నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు చేరుకొని గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళతారు.

First Published:  24 Nov 2023 5:50 AM GMT
Next Story