Telugu Global
Telangana

ఫామ్ హౌస్ పాలన కావాలా..? ప్రజాపాలన కావాలా..?

రాష్ట్రవ్యాప్తంగా లైంగిక దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలు జరగక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ఫామ్ హౌస్ పాలన కావాలా..? ప్రజాపాలన కావాలా..?
X

తెలంగాణలో ఫామ్ హౌస్ పాలన కావాలో, ప్రజాపాలన కావాలో.. తేల్చుకోవాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆమె భువనగిరి, గద్వాల, కొడంగల్ సభల్లో ప్రసంగించారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని పాలన చేస్తూ ప్రజల ధనం మొత్తాన్ని కేసీఆర్ లూటీ చేశారని విమర్శించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, ఆ తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ చేతిలో బందీగా మారిందని చెప్పారు.

పరీక్షల పేపర్లు లీక్ చేసి యువత జీవితాలు నాశనం చేశారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. తెలంగాణలో పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రపోతోందని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా లైంగిక దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలు జరగక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఒకవేళ నియామకాలు చేపట్టినా పేపర్ లీకులతో యువత నష్టపోతోందన్నారు. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు ఒక్కటై దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని అన్నారు.

వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ప్రజలకు ఏమీ చేయలేక పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఎందుకు ఎన్నుకోవాలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు.

First Published:  27 Nov 2023 4:08 PM GMT
Next Story