Telugu Global
Telangana

భట్టి ఎంతకైనా దిగజారుతాడు.. తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నేత

పేపర్ యాడ్‌లో భట్టి ఫొటో తీసేసి రేవంత్ రెడ్డి ఒక్కడి ఫొటోనే వేసుకుంటున్నాడు. అంటే రేవంత్ మొహం చూసే ఓట్లు పడ్డాయని అనుకోవాలి.

భట్టి ఎంతకైనా దిగజారుతాడు.. తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్‌ నేత
X

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. యాదాద్రిలో కింద కూర్చోబెట్టినా, సిగ్గులేకుండా నేనే కూర్చున్న అని భట్టి నీచంగా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. దళితుల ఆత్మగౌరవాన్ని భట్టి దెబ్బ తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్సన్.

"అధికారం కోసం భట్టి ఎంతకైనా దిగజారుతాడు. అలా దిగజారే కింద కూర్చున్నాడు. నేనే అతని స్థానంలో ఉంటే వాళ్లని లేపయినా కూర్చునే వాడిని. లేదా అక్కడి నుంచి లేచయినా వెళ్లిపోయే వాడిని. తమ పార్టీ వాడు కాబట్టి ఊరుకున్నా, లేదంటే అట్రాసిటి కేసు పెట్టేవాడిని" అంటూ భట్టిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బక్క జడ్సన్.

"ఒక్క దళితుడికి కూడా నామినేటెడ్ పదవి ఇప్పించలేదు. మళ్లీ శాసిస్తున్నా అంటున్నాడు. ఏం శాసిస్తున్నాడు, నా బొంగు శాసిస్తున్నాడా..? పేపర్ యాడ్‌లో భట్టి ఫొటో తీసేసి రేవంత్ రెడ్డి ఒక్కడి ఫొటోనే వేసుకుంటున్నాడు. అంటే రేవంత్ మొహం చూసే ఓట్లు పడ్డాయని అనుకోవాలి. జీవో 46 రద్దు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోడ్ నుంచి తమను మినహాయించాలని పలు జిల్లాల అభ్యర్థులు కోరుతున్నారు. అందులో ఖమ్మం జిల్లా బాధితులు కూడా ఉన్నారు. మరి భట్టి ఎందుకు రద్దు చెయ్యట్లేదు" అంటూ భట్టిపై ధ్వజమెత్తారు బక్క జడ్సన్.

First Published:  19 March 2024 7:51 AM GMT
Next Story