Telugu Global
Telangana

ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయం - కేటీఆర్

ఛలో నల్గొండ సభ సృష్టించిన ఒత్తిడి వల్లే కృష్ణా ప్రాజెక్టులను KRMBకి అప్పగించేది లేదని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుందన్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్‌కు ఇది తొలి విజయమన్నారు కేటీఆర్.

ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయం - కేటీఆర్
X

కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగింత అంశం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే KRMB మీటింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా ENC మురళీధర్‌రావును తెలంగాణ ప్రభుత్వం రాజీనామా కోరింది. ఇక ఇవాళ కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను KRMBకి అప్పగించేది లేదంటూ రేవంత్ సర్కార్‌ అసెంబ్లీలో తీర్మానం చేయనుంది.

ఈ అంశంపై ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఛలో నల్గొండ సభ సృష్టించిన ఒత్తిడి వల్లే కృష్ణా ప్రాజెక్టులను KRMBకి అప్పగించేది లేదని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుందన్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్‌కు ఇది తొలి విజయమన్నారు కేటీఆర్.


ఇటీవల నిర్వహించిన KRMB సమావేశం తర్వాత ఈఎన్సీ మాట్లాడుతూ.. ప్రాజెక్టులు అప్పగించామంటూ ప్రకటన చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించలేదు అని ప్రకటించింది. దీంతో గందరగోళం ఏర్పడింది. మరోవైపు బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టులను KRMBకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు గులాబీ బాస్‌ కేసీఆర్ హాజరుకానున్నారు. కృష్ణా ప్రాజెక్టుల వివాదంపై క్లారిటీ ఇవ్వనున్నారు.

First Published:  12 Feb 2024 5:08 AM GMT
Next Story