Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో తీన్మార్ మల్లన్నకు కీలక పదవి.!

కాంగ్రెస్‌లో చేరిన ఒక్క రోజు వ్యవధిలోనే పార్టీలో కీలక పదవి దక్కించుకున్నారు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌.

కాంగ్రెస్‌లో తీన్మార్ మల్లన్నకు కీలక పదవి.!
X

కాంగ్రెస్‌లో తీన్మార్ మల్లన్నకు కీలక పదవి.!

కాంగ్రెస్‌లో చేరిన ఒక్క రోజు వ్యవధిలోనే పార్టీలో కీలక పదవి దక్కించుకున్నారు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌ తీన్మార్ మల్లన్నను నియమిస్తూ ఆ కమిటీ ఛైర్మన్‌ మధు యాష్కి గౌడ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు టీ.కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు.

మధు యాష్కి ఛైర్మన్‌గా ప్రచార కమిటీని జూలైలో ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌. ఇప్పటికే సయ్యద్ అస్మతుల్లా హుస్సెనీ కన్వీనర్‌గా ఉండగా..తాజాగా మల్లన్నను మరో కన్వీనర్‌గా నియమించింది. ఈ కమిటీలో 37 మంది సభ్యులు ఉంటారు.

వీరితో పాటు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, కౌన్సిల్‌ నేత, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు ప్రచార కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రచారానికి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుంది.



First Published:  9 Nov 2023 5:18 PM GMT
Next Story