Telugu Global
Telangana

లోక్‌సభ ఎన్నికల్లోనూ సీపీఐతో కాంగ్రెస్‌ పొత్తు..!

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని సక్సెస్‌ఫుల్‌గా గెలుపు తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 10 నుంచి 16 లోక్‌సభ స్థానాలు గెలవాలని పట్టుదలతో ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లోనూ సీపీఐతో కాంగ్రెస్‌ పొత్తు..!
X

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ సీపీఐతో పొత్తు కొనసాగించేందుకే కాంగ్రెస్‌ మొగ్గు చూపుతోంది. తెలంగాణ అసెంబ్లీకి నవంబర్‌ 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ కలిసే పోటీచేశాయి. సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానం కేటాయించగా.. ఆ పార్టీ నేత‌ కూనంనేని విజయం సాధించారు. ఇక మరో రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని సీపీఐకి హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. తెలంగాణ వ్యాప్తంగా 64 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. లెఫ్ట్ పార్టీలు బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 22 అసెంబ్లీ స్థానాలకు 20 స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి.

లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐతో పాటు సీపీఎంను కలుపుకుని వెళ్లాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పొత్తుల అంశంపై చర్చించేందుకు జనవరి ఫస్ట్‌ వీక్‌లో తెలంగాణలోని కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షి.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని సక్సెస్‌ఫుల్‌గా గెలుపు తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 10 నుంచి 16 లోక్‌సభ స్థానాలు గెలవాలని పట్టుదలతో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మూడు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటు.. బీఆర్ఎస్‌, బీజేపీ సిట్టింగ్‌ స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

First Published:  27 Dec 2023 6:28 AM GMT
Next Story