Telugu Global
Telangana

కాంగ్రెస్‌, బీజేపీ కలిసి రైతుల నోట్లో మట్టికొట్టాయి- కేటీఆర్

కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశమిస్తే వీళ్లు ఏం చేశారు..? తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, పెన్షన్లు లేవు. రైతులను ఆగం చేసిండ్రు. మన బతుకులు నాశనం చేసిండ్రు.

కాంగ్రెస్‌, బీజేపీ కలిసి రైతుల నోట్లో మట్టికొట్టాయి- కేటీఆర్
X

కాంగ్రెస్‌, బీజేపీ కలిసి రైతుల నోట్లో మట్టికొట్టాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ నేతలే ఈసీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి కొత్త కుట్రకు తెరలేపాయన్నారు. అధికారంలోకి రాకముందే రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టాయని ఫైర్ అయ్యారు.

పొరపాటున కాంగ్రెస్సో, బీజేపీనో అధికారంలోకి వస్తే రైతుబంధును మొత్తానికే ఎత్తేస్తాయన్నారు కేటీఆర్. ఇక్కడి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటలు అలానే ఉన్నాయన్నారు. రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుంది, 24 గంటల కరెంట్‌ ఎందుకని రేవంత్‌ రెడ్డి అంటున్నడు. రైతుబంధు రైతుకిస్తే కౌలుదారుకు ఇవ్వం, కౌలుదారుకిస్తే రైతుకిచ్చేది లేదంటున్నడు. మరి ఆలోచించండి.. ఇవాళ నాణ్యమైన 24గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్‌ కావాలో.. మళ్లీ ట్రాన్స్‌ఫారాలు కాలబెట్టే కాంగ్రెస్సు కావాలో" అని ఓట‌ర్ల‌ను కోరారు కేటీఆర్.

ఒక్క‌సారి ఛాన్స్ ఇవ్వండి అని కోరుతున్న కాంగ్రెస్‌ పార్టీ కొత్తదేం కాదు, చెత్తపార్టీ అన్ని విమర్శించారు కేటీఆర్. "ఒక్కసారి అవకాశం ఇవ్వాలని హస్తం నేతలు అడుగుతున్నారు. ఇప్పటివరకు 11 సార్లు అవకాశమిస్తే వీళ్లు ఏం చేశారు..? తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, పెన్షన్లు లేవు. రైతులను ఆగం చేసిండ్రు. మన బతుకులు నాశనం చేసిండ్రు. 55 ఏండ్లు తెలంగాణ ఇవ్వకుండా మన పిల్లలను సావగొట్టిండ్రు. వందల మంది పిల్లల్ని పొట్టన పెట్టుకుండ్రు" అని కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేటీఆర్.

First Published:  27 Nov 2023 7:41 AM GMT
Next Story