Telugu Global
Telangana

మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కొండల్‌ రెడ్డి మల్కాజ్‌గిరి స్థానం కోసం గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి
X

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నారా..? రేవంత్‌ రెడ్డి సిట్టింగ్ సీటు మల్కాజ్‌గిరి ఆయనదేనా..? అంటే దాదాపు అవుననే సమాధానమే వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు రేవంత్. ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగ‌ల్ నుంచి విజయం సాధించడంతో ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు కొండల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కొండల్‌ రెడ్డి మల్కాజ్‌గిరి స్థానం కోసం గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాష్ట్ర నాయ‌క‌త్వం కాంగ్రెస్‌ అధిష్టానానికి సైతం పంపింది. మల్కాజ్‌గిరి నుంచి నిర్మాత బండ్ల గణేష్‌, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేర్లు అధిష్టానానికి పంపారు. వీరిలో ఒకరి పేరును హైకమాండ్ ఫైనల్ చేయనుంది.

ఇటీవల జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లో కొండల్ రెడ్డి చురుకుగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తరపున అన్ని తానై చూసుకున్నారు కొండల్ రెడ్డి. స్థానిక నాయకులతో సమన్వయం చేసుకున్నారు.

First Published:  7 Feb 2024 5:24 AM GMT
Next Story