Telugu Global
Telangana

రేపు మోడీతో రేవంత్ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ!

ప్రధాని మోడీతో సమావేశం అనంతరం కాంగ్రెస్‌ హైకమాండ్‌తోనూ రేవంత్, భట్టి చర్చలు జరపనున్నారు. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవులతో పాటు కేబినెట్‌లో మిగిలిన ఆరు బెర్తులపై పార్టీ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది.

రేపు మోడీతో రేవంత్ భేటీ.. ఆ అంశాలపైనే చర్చ!
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోడీతో సీఎం రేవంత్ సమావేశమవుతారని సీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం హోదాలో ప్రధానితో రేవంత్‌ రెడ్డికి ఇదే తొలి సమావేశం. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.

మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన హామీలపై ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది.

ప్రధాని మోడీతో సమావేశం అనంతరం కాంగ్రెస్‌ హైకమాండ్‌తోనూ రేవంత్, భట్టి చర్చలు జరపనున్నారు. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవులతో పాటు కేబినెట్‌లో మిగిలిన ఆరు బెర్తులపై పార్టీ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసి నాయకులతో పాటు కేడర్‌లో జోష్‌ నింపాలని టీపీసీసీ భావిస్తోంది.

First Published:  25 Dec 2023 9:15 AM GMT
Next Story