Telugu Global
Telangana

మళ్లీ ఢిల్లీకి రేవంత్‌.. కేబినెట్‌లోకి ఆ ఆరుగురు..!

ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న 6 బెర్తుల కోసం దాదాపు డజను మందికిపైగా పోటీ పడుతున్నారు.

మళ్లీ ఢిల్లీకి రేవంత్‌.. కేబినెట్‌లోకి ఆ ఆరుగురు..!
X

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 19న ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. కేబినెట్‌ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల అంశంపై హైకమాండ్‌తో రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్‌ తేవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో హోం శాఖతో పాటు పలు కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న 6 బెర్తుల కోసం దాదాపు డజను మందికిపైగా పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవల ఎన్నికల్లో ఓడిన వారు కూడా ఉన్నారు.

ఆరు బెర్తులపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మైనంపల్లి హన్మంతరావు రేసులో ఉన్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో మైనంపల్లిని మల్కాజ్‌గిరి నుంచి బరిలో దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక అంజన్‌ కుమార్‌, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్, ప్రేమ్‌సాగర్ రావు మధ్య పోటీ నడుస్తోంది. ఇక నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది.

First Published:  17 Dec 2023 11:28 AM GMT
Next Story