Telugu Global
Telangana

ఫిబ్రవరిలో కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ ప్లాన్‌

మిగిలిన ఆరు ఖాళీ బెర్తుల కోసం రెడ్లు, వెలమలకు మధ్య గట్టి పోటీ ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవుల రేసులో ఉన్నారు.

ఫిబ్రవరిలో కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ ప్లాన్‌
X

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం రేవంత్ కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఫిబ్రవరి మధ్యలో కేబినెట్ విస్తరణ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్‌లో 18 మందికి ఛాన్స్ ఉండగా.. ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, బీజేపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరతారని తెలుస్తోంది. రెండు పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని సమాచారం. నలుగురు లేదా ఐదుగురు పార్టీలో చేరితే ఒకరిద్దరికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతమున్న 12 మంది మంత్రుల్లో నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన సీతక్క, బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇక వెలమ, కమ్మ, బ్రాహ్మణ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్‌లో చోటు దక్కింది.

మిగిలిన ఆరు ఖాళీ బెర్తుల కోసం రెడ్లు, వెలమలకు మధ్య గట్టి పోటీ ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవుల రేసులో ఉన్నారు. కాగా, మల్‌రెడ్డికి చీఫ్ విప్‌ లేదా ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తారని తెలుస్తోంది. వెలమ సామాజిక వర్గం నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు కేబినెట్‌లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్‌, వినోద్‌ మంత్రి పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు.

ఇక మైనార్టీల నుంచి మినిస్టర్ ఉంటారా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. షబ్బీర్‌ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. త్వరలోనే కేబినెట్ హోదా కల్పిస్తారని తెలుస్తోంది. ఆదిలాబాద్, మహబూబబాద్ ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలు కావడంతో లంబాడా సామాజిక వర్గానికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలున్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌ ముందు వరుసలో ఉన్నారు.

First Published:  23 Jan 2024 4:31 PM GMT
Next Story