Telugu Global
Telangana

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ న్యూ ఇయర్ గిఫ్ట్

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు పెద్దఎత్తున మద్దతు తెలిపారు. దీంతో వారి రుణం తీర్చుకోవాలని చూస్తోంది రేవంత్ సర్కారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ న్యూ ఇయర్ గిఫ్ట్
X

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేందుకు రేవంత్‌ సర్కారు సిద్ధమవుతోంది. కొత్త ఏడాది నుంచే దీనిని అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కేసీఆర్ హ‌యాంలో ప్ర‌భుత్వ ఉద్యోగులకు ఏనాడూ కరెక్ట్ తేదీకి జీతాలు ఇవ్వలేదనే ఆరోపణలు వినిపించాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు పెద్దఎత్తున మద్దతు తెలిపారు. దీంతో వారి రుణం తీర్చుకోవాలని చూస్తోంది రేవంత్ సర్కారు.

ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 5లోపే జీతాలు వేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. సంక్షేమ పథకాలు ఆపైనా సరే 5వ తేదీ లోపే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు వేయాలని ప్రభుత్వం చూస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా జీతాల కోసం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయకుండా, జాగ్రత్తలు తీసుకోవాలని ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికీ తగిన ప్రయారిటీ ఇచ్చేలా సర్కారు చర్యలు చేపట్టింది. వారి పెండింగ్ బిల్లులు సైతం ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం.

First Published:  31 Dec 2023 8:48 AM GMT
Next Story