Telugu Global
Telangana

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు, నెలకు రూ.25 వేల పెన్షన్‌

పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్‌ శిల్పాకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు, నెలకు రూ.25 వేల పెన్షన్‌
X

కవులు, కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కళాకారులకు జీవిత చరమాంకంలో దుప్పట్లు, చప్పట్లు మిగులుతున్నాయన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల ఆర్థిక సాయంతో పాటు, నెలకు రూ.25 వేల పెన్షన్ అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్‌ శిల్పాకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్న వారిని సత్కరించారు.


వెంకయ్య రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి. ఇక‌ చిరంజీవి కమిట్‌మెంట్ ఉన్న నటుడని చెప్పారు. పున్నమినాగులో ఏ స్థాయిలో నటించారో.. సైరాలోనూ అదే స్థాయిలో నటించారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరంజీవి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. గొప్ప వ్యక్తుల పోత్సాహంతో ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పారు సీఎం రేవంత్.

First Published:  4 Feb 2024 12:01 PM GMT
Next Story