Telugu Global
Telangana

జూన్‌లో నాలుగు కొత్త కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ నెలలో ఈ నాలుగు కలెక్టరేట్లను కేసీఆర్ ప్రారంభించనున్నట్లు సీఎంవో తెలిపింది.

జూన్‌లో నాలుగు కొత్త కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ నెలలో ఈ నాలుగు కలెక్టరేట్లను కేసీఆర్ ప్రారంభించనున్నట్లు సీఎంవో తెలిపింది. జూన్ 4న నిర్మల్ జిల్లా కలెక్టరేట్, జూన్ 6న నాగర్‌కర్నూల్ కలెక్టరేట్, జూన్ 9న మంచిర్యాల జిల్లా కలెక్టరేట్, జూన్ 12న జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను 2016లో తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగు జిల్లాలుగా విభజించింది. ఇందులో భాగంగా ఏర్పడిన నిర్మల్ జిల్లా కోసం సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని మూడేళ్ల క్రితం ప్రారంభించారు. నిర్మల్ పట్టణ శివారు ఎల్లపెల్లి గ్రామ పరిధిలో 15 ఎకరాల స్థలంలో రూ.56 కోట్లతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అందించిన నిధులతో ఎన్‌సీసీ కన్సల్టెంట్స్ అనే సంస్థ అత్యంత సుందరంగా ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే 50 శాతం పైగా పనులు పూర్తయ్యాయి.

ఈ కలెక్టరేట్‌లో కలెక్టర్ చాంబర్‌తో పాటు క్యాంప్ ఆఫీస్, అదనపు కలెక్టర్లు చాంబర్లు, 36 శాఖలకు చెందిన కార్యాలయాలు ఉండనున్నాయి. మూడు బ్లాక్‌లు, మూడు ఫ్లోర్‌లతో ఈ భవనాన్ని సువిశాలంగా నిర్మిస్తున్నారు. ఓపెనింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో 250 మంది కూలీలతో వేగంగా పనులు చేయిస్తున్నారు.


First Published:  26 May 2023 1:29 PM GMT
Next Story