Telugu Global
Telangana

ఈనెల‌ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో, అభ్యర్థులకు బీఫామ్‌లు

కేసీఆర్ జిల్లా పర్యటనలకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారు చేసింది బీఆర్ఎస్‌. ప్రచారం విషయంలో తన సెంటిమెంట్‌ను మరోసారి ఫాలో కానున్నారు సీఎం కేసీఆర్‌.

ఈనెల‌ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో, అభ్యర్థులకు బీఫామ్‌లు
X

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మరింత దూకుడు పెంచింది అధికార బీఆర్ఎస్ పార్టీ. మేనిఫెస్టో రిలీజ్‌, బీ ఫామ్‌ల అందజేతతో పాటు కేసీఆర్ జిల్లా పర్యటనలను ఖరారు చేసింది. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత.. ఈనెల 15న తెలంగాణ భవ‌న్‌లో మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేయనున్నారు.

దీంతో పాటు కేసీఆర్ జిల్లా పర్యటనలకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారు చేసింది బీఆర్ఎస్‌. ప్రచారం విషయంలో తన సెంటిమెంట్‌ను మరోసారి ఫాలో కానున్నారు సీఎం కేసీఆర్‌. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్‌ 15న హుస్నాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభతో సీఎం కేసీఆర్ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్టోబర్‌ 16న జనగామ, భువనగిరి, అక్టోబర్‌ 17న సిద్దిపేట, సిరిసిల్ల.. అక్టోబర్‌ 18న జడ్చర్ల, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ఉంటాయి.

ఇక నవంబర్‌ 9న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేస్తారు సీఎం కేసీఆర్. కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వ‌హించిన‌ అనంతరం సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయ‌నున్నారు.

First Published:  9 Oct 2023 1:38 PM GMT
Next Story