ఎల్లుండి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో, ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, సభలో లేవనెత్తే అంశాల పై BRS పార్లమెంటరీ పార్టీ సభ్యులు చర్చిస్తారు.
BY Telugu Global27 Jan 2023 9:35 AM GMT

X
Telugu Global27 Jan 2023 9:35 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధయ్క్షుడు కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో, ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, సభలో లేవనెత్తే అంశాల పై BRS పార్లమెంటరీ పార్టీ సభ్యులు చర్చిస్తారు. పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story