Telugu Global
Telangana

మార్చి 26న మహారాష్ట్రలో మరో భారీ బహిరంగ సభ నిర్వహి‍ంచనున్న బీఆరెస్

పార్టీ ఎజెండా, దేశంతో పాటు మహారాష్ట్ర రాష్ట్రం కోసం తన విజన్, కార్యాచరణ ప్రణాళిక గురించి కేసీఆర్ మహారాష్ట్ర నాయకులతో చర్చించారు. అట్టడుగు స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని వారిని కోరారు.

మార్చి 26న మహారాష్ట్రలో మరో భారీ బహిరంగ సభ నిర్వహి‍ంచనున్న బీఆరెస్
X

భారత రాష్ట్ర సమితి మహారాష్ట్ర లో మరో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నెల 26న మహారాష్ట్రలోని కంధర్-లోహా ప్రాంతంలో ఈ సభ జరగనుంది. ఈ సభలో బీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రధాన వక్తగా హాజరుకానున్నారు.

నాందేడ్ సభ విజయవంతం అయిన తర్వాత బీఆరెస్ మహారాష్ట్రలో పార్టీ విస్తరణ కార్యకరమాలను విస్త్రుతం చేసింది. అందులో భాగంగా నిన్న మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకర్ అన్నా ధొంగ్డే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ, మహారాష్ట్ర ఎన్సీపీ యూత్ కార్యదర్శి శివరాజ్ ధోంగ్డే, ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, నాందేడ్ నగర అధ్యక్షుడు శివదాస్ ధర్మపుర్కర్, ఎన్సీపీ అధికార ప్రతినిధి సునీల్ పాటిల్, పలువురు ఎన్సీపీ నేతలు హైదరాబాద్‌లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. వీరి వెంట ఆర్మూర్‌ ఎమ్మెల్యే, నాందేడ్‌ ఇన్‌ఛార్జ్‌ జీవన్‌రెడ్డి కూడా ఉన్నారు.

బీఆర్‌ఎస్ ఎజెండాకు, కేసీఆర్ దార్శనికతకు ఆకర్షితులైన తాము బీఆరెస్ లో చేరుతున్నట్టు వారు తెలిపారు. 26న బహిరంగ సభ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన మరింత మంది సీనియర్ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

పార్టీ ఎజెండా, దేశంతో పాటు మహారాష్ట్ర రాష్ట్రం కోసం తన విజన్, కార్యాచరణ ప్రణాళిక గురించి కేసీఆర్ మహారాష్ట్ర నాయకులతో చర్చించారు. అట్టడుగు స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని వారిని కోరారు.

First Published:  15 March 2023 1:53 AM GMT
Next Story